మోసానికి షర్టు, ప్యాంటు వేస్తే ఆయనే: జగన్ ఘాటు విమర్శలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-19 10:16:56  IST  )

మోసానికి షర్టు, ప్యాంటు వేస్తే సీఎం చంద్రబాబు అవుతారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు...

మోసానికి షర్టు, ప్యాంటు వేస్తే ఆయనే: జగన్ ఘాటు విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: మోసానికి షర్టు, ప్యాంటు వేస్తే సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అవుతారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి(Tadepalli) నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌(Budject)లో పచ్చి అబద్ధాలు, చంద్రబాబు భజన మాత్రమే ఉందన్నారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) హయాంలో ప్రచారం పీక్‌లో ఉంటుందని, పని తక్కువ అని ఎద్దేవా చేశారు. జీడీపీ(Gdp), జీఎస్డీపీ(Gsdp)పై చంద్రబాబు తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. బడ్జెట్ లెక్కలు నిజమైతే ప్రజలు తలసరి ఆదాయం పెరగాలి కదా అని ప్రశ్నించారు. వైసీపీ(Ycp) హయాంతో పోల్చితే చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఆదాయం పెరుగుదల నామ మాత్రమేనని జగన్ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌తో ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని తెలిపారు.

నెరవేర్చకపోయినా..

సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోయినా వాటిని అమలు చేశానని చంద్రబాబు చెబుతున్నారని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆదాయాన్ని చూస్తే 9.64 శాతం పురోగతి ఉందని, రాష్ట్రాన్ని చూసుకుంటే 1.97 శాతం ఉందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) చెప్పారు. అన్ని రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రం దిగువన 23 రాష్ట్రాల్లో దిగువన ఉన్నామని పేర్కొన్నారు. వృద్ధి రేటు మాత్రం దూసుకుపోతున్నామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, 2024-25లో 11.75 శాతంతో దూసుకుపోతున్నామని, దేశమంతా కేవలం 9.8 శాతమేనని సీఎం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 2025-26 రాష్ట్రంలో 10.75 శాతంతో దూసుకుపోతున్నానమని, దేశమంతా 8 శాతమే మాత్రమే ఉందని చంద్రబాబు చెబుతున్నారని తెలిపారు. 9.64 శాతం ఆదాయాలు గ్రోత్ రేట్ నమోదు చేస్తే కేంద్రం.. జీడీపీ గ్రోత్ రేట్ 8 శాతం, 2024లో 9.8 శాతం చూపిస్తోందన్నారు. 1.99 శాతం చంద్రబాబు నమోదు చేస్తావుంటే ఏరకంగా జీఎస్‌డీపీ వృద్ధి రేటు 11.5 శాతం, 10.75 శాతం నమోదు అవుతుందని, ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారని జగన్ విమర్శించారు.

2024 కల్లా అప్పులు...

‘‘2014కల్లా అప్పులు రూ.లక్షా 47 వేల 717 కోట్లుగా ఉంది. బాబు దిగిపోయే నాటికి రూ.3 లక్షల 90 వేల 247 కోట్ల అప్పులు కాగా మేం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.7లక్షల 21 వేల 918 కోట్లు. కానీ.. రూ.9లక్షల 74 వేల కోట్లు అని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ఇలా తప్పుడు ప్రచారాలు చేయవచ్చా.?’’ అని ఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

Next Story