తిరుమల లడ్డూపై మాజీ సీఐడీ చీఫ్ ట్వీట్

by Thanuru Gopichand |

రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్న ఆధ్యాత్మిక అంశాలు.

తిరుమల లడ్డూపై మాజీ సీఐడీ చీఫ్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి (Adulterated Ghee) వినియోగించారనే ఆరోపణలో ప్రభుత్వం నియమించిన సిట్ (SIT) విచారణ జరిపింది. ఇటీవలే ప్రభుత్వానికి నివేదికను కూడా సమర్పించింది. ఈ నివేదిక ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిని జంతు కొవ్వుతో తయారు చేయలేదని నివేదికలో సిట్ పేర్కొంది. అంతేకాకుండా కేవలం పామాయిల్ (Palmoil), వనస్పతి (Vanaspathi) వంటి నూనెలతో కల్తీ చేసినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఏపీ సీఐడీ చీఫ్ గా గతంలో పనిచేసిన పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) తిరుమల లడ్డూ అంశంపై స్పందించారు. తన ఎక్స్ ఖాతా వేదికగా తిరుమల లడ్డూ, శ్రీవారి ఆలయ గోపురాన్ని కలిపి చూపించేలా ఉన్న చిత్రంను పోస్టు చేశారు.నా జోలికి రాకపోతే నేను పట్టించుకోను.. కానీ నా జోలికి వస్తే ఆ దేవ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడడు" నేను పట్టించుకోను, నా జోలికి వస్తే దేవ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడడు, ఇంకా కావాలా???" అంటూ వ్యంగ్యాస్త్రాలను విసిరారు.

అయితే గతంలో ఈ వ్యవహారంపై తనను విమర్శించిన వారిని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నిజం నిలకడ మీద తెలుస్తుందని, సిట్ నివేదికతో తన వాదన బలపడిందని ఆయన పరోక్షంగా పేర్కొన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేశారని, భక్తుల సెంటిమెంట్లతో ఆడుకున్నారని పలు సందర్భాల్లో ఆయన విమర్శించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీల గుట్టు విచారణలో తేలిందని, ఇందులో ఎటువంటి జంతు అవశేషాలు లేవని స్పష్టం కావడంతో జరుగుతున్న అసత్య ప్రచారాలకు చెక్ పెట్టినట్లయిందని అభిప్రాయాన్ని కూడా సునీల్ కుమార్ వెల్లిబుచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story