- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటవీ భూముల ఆక్రమణ వ్యవహారం.. సజ్జల ఫ్యామిలీకి బిగుస్తోన్న ఉచ్చు
ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ (YCP) నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములపై ప్రధానంగా కన్నేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ (YCP) నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములపై ప్రధానంగా కన్నేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే 64 ఎకరాల అటవీ భూమి (Forest Land)ను వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Rama Krishna Reddy) కుటుంబ సభ్యులు ఆక్రమించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం నిజాలను నిగ్గు తేల్చేందుకు త్రిసభ్య కమిటీ (Three Member Committee)ని నియమించింది. ఈ మేరకు ఆ కమిటీ రెండు నెలల పాటు విచారణ జరపగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా 64 ఎకరాల అటవీ భూమి ఆక్రమణలో ఉందని ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమగ్ర నివేదికను అందజేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సజ్జల ఫ్యామిలీ (Sajjala Family)పై ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.
కాగా, కడప జిల్లా (Kadapa District) సీకే దిన్నె (CK Dinne) మండల పరిధిలోని సజ్జల ఎస్టేట్ (Sajjala Estate)లో ప్రైవేటు, డీకేటీ పట్టా భూములు సైతం కబ్జా చేసినట్లుగా బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల జనార్ధన్ రెడ్డి, సజ్జల సందీప్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో 146 ఎకరాల పట్టా భూమి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. అందులో సజ్జల సందీప్ రెడ్డి (Sajjala Sandeep Reddy) పేరు మీద 71.49 ఎకరాలు, సజ్జల జనార్ధన్ రెడ్డి (Sajjala Janardhan Reddy) పేరుతో 18.85 ఎకరాలు, నర్రెడ్డి బాగిరెడ్డి (Nareddy Bagi Reddy) పేరు మీద 19.22 ఎకరాలు, వై.సత్య సందీప్ రెడ్డి (Satya Sandeep Reddy) 21.46 ఎకరాలు, సజ్జల విజయ కుమారి (Sajjala Vijaya Kumari) పేరుతో 7.30 ఎకరాల భూమి ఉంది. అయితే, సర్వే నెం.1629లో సుమారు 11 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో 64 ఎకరాలను సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నట్లు అధికారుల సర్వేలో వెల్లడైంది. వైసీపీ సర్కార్ హయాంలో కడప డీఎఫ్‌వో (DFO)గా ఉన్న సదరు అధికారిపై ఒత్తిడి తెచ్చి ఆ భూములను సజ్జల రామకృష్ణా రెడ్డి పట్టా భూమిగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది.






