- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Elephants Attack:గజరాజుల బీభత్సం.. అటవీశాఖ సిబ్బందిపై దాడి
ఇటీవల ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చేతికి వచ్చిన పంట పొలాలను నాశనం చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు ఏనుగుల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు ఏనుగుల గుంపులు తరిమేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ తరుణంలో తాజాగా తిరుపతి జిల్లాలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించాయి. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలంలో ఏనుగులు(Elephants Attack) హల్‌చల్ చేశాయి. ఈ మేరకు స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన అటవీశాఖ సిబ్బంది.. డ్రోన్ కెమెరాల ద్వారా ఏనుగుల గుంపును గుర్తించారు. ఈ తరుణంలో అటవీశాఖ సిబ్బంది వాటిని అడవిలోనికి తరిమేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఏనుగులు తిరగబడ్డాయి.
ఈ క్రమంలో బోయపల్లి వద్ద అటవీశాఖ సిబ్బందిపై దాడి చేశాయి. ఈ దాడి ఘటనలో ఎలిఫెంట్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాయపడ్డారు. సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్‌కు కూడా గాయాలయ్యాయి. బోయినపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ క్రమంలో ఉస్తికాయలపెంట, కోటకాడ పల్లి, యలమంద గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.






