Amaravati: కాలేజీలో ఫుడ్ పాయిజన్.. 300 మంది విద్యార్థులకు అస్వస్థత..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-05 11:08:21  IST  )

అమరావతిలోని ప్రైవేటు కాలేజీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది...

Amaravati: కాలేజీలో ఫుడ్ పాయిజన్.. 300 మంది విద్యార్థులకు అస్వస్థత..!
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతిలోని ఓ ప్రైవేటు కాలేజీ(Amaravati SRM College)లో ఫుడ్ పాయిజన్(Food poisoning) కలకలం రేగింది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత 300 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. అయితే విషయాన్ని బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం మేనేజ్ చేసింది. అంతేకాదు విద్యార్ధులను ఇంటికి పంపించారు. విషయం బయటకు రాకుండా విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

Next Story