- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద.. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక
విజయవాడ(Vijayawada)లోని ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage) వద్ద వరద(Flood) ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada)లోని ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage) వద్ద వరద(Flood) ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 65వేల క్యూసెక్కులు విడుదల చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. రానున్న రెండు రోజుల్లో దాదాపు 3 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం 55 గేట్లను ఒక అడుగు మేర, 15 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి ఈస్ట్, వెస్ట్ కెనాల్స్ ద్వారా 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.54 లక్షల క్యూసెక్కులు నమోదైంది.
విజయవాడ నగరంలో 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దు.
వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదు. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయండి. గతేడాది విజయవాడలో సంభవించిన వరదల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది ఎలాంటి విపత్తులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.






