అన్నదాతలకు మేలు చేకూర్చేలా పంచ సూత్రాలు : మంత్రి అచ్చెన్నాయుడు

by Thanuru Gopichand |

వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచి.. అన్నదాతలకు ఇంకా మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను అమలు చేయబోతున్నాం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

అన్నదాతలకు  మేలు చేకూర్చేలా పంచ సూత్రాలు : మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచి.. అన్నదాతలకు ఇంకా మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను అమలు చేయబోతున్నాం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నేడు కృష్ణ జిల్లా ఘంటసాలలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. రైతులకు పంచ సూత్రాల ద్వారా మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అననారు. అందులో భాగంగా రైతన్నా మీ కోసం కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. నేటి నుంచి నవంబరు 29 వరకు అధికారులు ప్రతి రైతు ఇంటి గుమ్మం తొక్కుతారన్నారు. వారికి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.

డిసెంబరు 3 నుంచి ప్రతి రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులో నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. అందులో భాగంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సహకారం, రైతులకు అవగాహన కార్యక్రమాలు పరధాన అజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులందరికీ అవగాహన కల్పించాలని అధికారులకు ఇప్పటికే దిశా నిర్దేశం చేశామన్నారు. 17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమాలను రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుండి నడిపించాలన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో కార్యాచరణ ప్రణాళిక అమలుచేయాలి - మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Next Story