మోహన్‌బాబు యూనివర్సిటీపై జరిమానా.. మంచు విష్ణు కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీ (Mohan Babu University) గుర్తింపును రద్దు చేయాలని సర్కార్‌కు ఉన్నత విద్యా కమిషన్ (Higher Education Commission) సిఫారసు చేసింది.

మోహన్‌బాబు యూనివర్సిటీపై జరిమానా.. మంచు విష్ణు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీ (Mohan Babu University) గుర్తింపును రద్దు చేయాలని సర్కార్‌కు ఉన్నత విద్యా కమిషన్ (Higher Education Commission) సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలోనే తమ యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణలపై తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. విద్యార్థుల నుంచి తము అదనపు ఫీజును వసూలు చేయలేదని అన్నారు. అకాడమిక్ ఇయర్ ప్రకారం ఎంత ఫీజు వసూలు చేయాలో అంతే వసూలు చేశామని తెలిపారు. మోహన్‌బాబు యూనివర్సిటీపై వస్తున్న నిరాధరమైన వార్తలను నమ్మవద్దని ప్రజలకు మంచువిష్ణు విజ్ఞప్తి చేశారు.

కాగా, మోహన్‌బాబు యూనివర్సిటీలో గడిచిన మూడేళ్లలో ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారని కమిషన్‌కు ఇటీవలే పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయి. ఈ అంశంపై విచారణ చేపట్టగా.. ఫీజుల వసూలు నిజమని తేలడంతో యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించింది. అదేవిధంగా విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.25 కోట్లను 15 రోజుల్లోగా తిరిగి విద్యార్థులకు చెల్లించాలని ఆదేశించింది.

Next Story