తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ తారలు

by Jakkula.Mamatha |

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ తారలు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు(Devotees) విశ్వసిస్తారు. ఈ తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల(Tirumala) కొండకు చేరుకుంటారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తిరుమల చేరుకొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు.

ఈ నేపథ్యంలో ఇవాళ(సోమవారం) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సినీ నటి మీనా, మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. తొలుత వీరికి టీటీడీ(TTD) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Next Story