- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం మరో నిర్ణయం.. రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం
అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: అమరజీవి పొట్టి శ్రీరాములు(Potti Sriramulu) 58 అడుగుల విగ్రహాన్ని అమరావతి(Amaravati)లో ఏర్పాటు చేస్తామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి(Minister Dola Sribala Veeranjaneya Swamy) స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణాలు ఆర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన చేసిన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని మంత్రి గుర్తు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ చేపట్టిన ర్యాలీలపై మంత్రి స్వామి స్పందించారు. వైసీపీ నాయకులు కోటి సంతకాలకు అర్ధం లేదన్నారు. జగన్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ. 8,500 కోట్లు ఇస్తే కనీసం రూ.1,500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో పేదలకు 64 మందికి సీట్లు ఇస్తే తాము 75 సీట్లు ఇస్తున్నామని తెలిపారు. మరో రెండేళ్లలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు.






