నున్నలో అమానుషం.. కూతురికి కడుపు చేసిన బాబాయ్

by Naga Rani Yarlagadda |

ఎన్టీఆర్ జిల్లా.. విజయవాడకు సమీపంలో ఉన్న నున్నలో అమానుష ఘటన చోటుచేసుకుంది.

నున్నలో అమానుషం.. కూతురికి కడుపు చేసిన బాబాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లా.. విజయవాడకు సమీపంలో ఉన్న నున్నలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు లేని బాలికను చేరదీస్తామని తమతో ఉంచుకున్న బాబాయ్.. దారుణానికి పాల్పడ్డాడు. 7వ తరగతి చదువుతున్న కూతురికి కడుపు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. బాలిక తల్లిదండ్రులు ఆరేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి పిన్ని, బాబాయ్ ల వద్దే ఉంటూ చదువుకుంటోంది.

ఇటీవల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో పిన్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు గర్భం దాల్చినట్లు నిర్థారించారు. దీంతో అసలు విషయం ఆరా తీయగా.. ఇందుకు కారణం బాబాయేనని చెప్పింది. ఖంగుతిన్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక బాబాయ్ పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

Next Story