రియల్టర్ల మధ్య విభేదాలు.. తండ్రి కొడుకుల దారుణ హత్య

by Naga Rani Yarlagadda |

రియల్టర్ల మధ్య ఉన్న విభేదాలు తండ్రి-కొడుకుల హత్యకు కారణమయ్యాయి.

రియల్టర్ల మధ్య విభేదాలు.. తండ్రి కొడుకుల దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: రియల్టర్ల మధ్య ఉన్న విభేదాలు తండ్రి-కొడుకుల హత్యకు కారణమయ్యాయి. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులోని ఓ రియల్ ఎస్టేట్ లో జరిగిన తండ్రి, కొడుకుల హత్యలు కలకలం రేపాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతులను బెంగళూరుకు చెందిన కె.వీరాస్వామిరెడ్డి (62), అతని కొడుకు కె.వి.ప్రసాద్ రెడ్డి (37) నిన్న సాయంత్రం కోర్టు పనిపై పల్నాడు జిల్లా నరసరావుపేటకు వచ్చారు.

బుధవారం ఉదయం నరసరావుపేట కోర్టుకు వెళ్తున్న సమయంలో రెండు వాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు తండ్రి, కొడుకుని కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి పాతమాగులూరులోని రియల్ ఎస్టేట్ వెంచర్లోకి తీసుకెళ్లి ఇద్దరినీ చంపి పరారయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్యనున్న విభేదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. మాధవరెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇద్దరినీ హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Next Story