- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం
కడప జిల్లా చాపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ టెంపో వాహనం వెనుకనుంచి బలంగా ఢీ కొట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా చాపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ టెంపో వాహనం వెనుకనుంచి బలంగా ఢీ కొట్టింది. తెల్లవారుజామున దాదాపు 2 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీకి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మృతులు అనూష (30), ఓబులమ్మ (40), రాములమ్మ(48) లుగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన 8 మందిని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు ప్రారంభించారు.
Next Story






