- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ రైతన్నల పండుగ ‘ఏరువాక’.. ప్రత్యేకతలు ఏంటంటే ?
ఇవాళ రైతన్నల పండుగ ఏరువాక నిర్వహించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రైతన్నలకు బిగ్ అలర్ట్. ఇవాళ రైతన్నల పండుగ ఏరువాక నిర్వహించనున్నారు. నేడు జేష్ఠ పౌర్ణమి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల పండుగ ఏరువాక ఉత్సవాలను నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమైంది. గుంటూరు సమీపంలోని లాం వ్యవసాయ పరిశోధన కేంద్రం లో జరిగే వేడుకలలో మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎద్దులు, భూమిని పూజించి పొలంలో నాగలితో దున్ని వ్యవసాయ పనులను అన్నదాతలు ప్రారంభిస్తారు. ఖరీఫ్ లో ఎలినినో ప్రభావం, వేయాల్సిన పంటలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించనున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు. అందుకే వర్షాకాలం ప్రారంభం కాగానే కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత బొబ్బట్లు వాటికి పెడతారు. పొలానికి వెళ్లి భూమాతకు ఆరాధిస్తారు. ఏరువాక పౌర్ణమి రోజున సాయంత్రం.. రంగురంగుల బట్టలతో ఎద్దులను అలంకరిస్తారు. అనంతరం ఎద్దులు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు. ఇదే ఈ ఏరువాక ప్రత్యేకత.






