- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్కెట్‌లో టమాటా జోరు: ధర చూసి రైతు ఖుషీ
ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా పేరుగాంచిన మదనపల్లెలో టమాటా ధరలు రైతులకు ఊరటనిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా పేరుగాంచిన మదనపల్లెలో టమాటా ధరలు రైతులకు ఊరటనిస్తున్నాయి. మంగళవారం జరిగిన వేలంలో మొదటి రకం టమాటా ధర కిలోకు రూ.28గా నమోదైంది. గత కొన్ని రోజులతో పోలిస్తే ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మదనపల్లె నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు సుమారు 174 మెట్రిక్ టన్నుల టమాటాలను మార్కెట్‌కు తీసుకువచ్చారు. సీజన్ కావడంతో మార్కెట్ యార్డ్ మొత్తం టమాటా క్రేట్లతో కిటకిటలాడింది. స్థానిక వ్యాపారులు నాణ్యతను బట్టి టమాటాలను మూడు రకాలుగా వర్గీకరించి కొనుగోలు చేశారు.
= మొదటి రకం: 10 కిలోల బాక్స్ రూ.280 (కిలో రూ.28)
= రెండవ రకం: 10 కిలోల బాక్స్ రూ.210 (కిలో రూ.21)
= మూడవ రకం: 10 కిలోల బాక్స్ రూ.190 (కిలో రూ.19)
రైతుల్లో చిరునవ్వు...
పెట్టుబడి ఖర్చులు కూడా రాని స్థితి నుంచి, ఇప్పుడు కిలో రూ.28 వరకు ధర పలకడంపై టమాటా సాగుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.






