- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సినీ నటి
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తిరుమల చేరుకొని భక్తి శ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో ఇవాళ(ఆదివారం) శ్రీవారిని ప్రముఖ తమిళ సినీనటి వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శించుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఆమె తన భర్త నికోలయ్ సచ్‌దేవ్‌తో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన వరలక్ష్మి శరత్ కుమార్ దంపతులు సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం వారు భక్తులతో సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలో కొందరు భక్తులు వారితో సెల్ఫీలు తీసుకున్నారు.






