ఏపీలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ విస్తరణ

by Muthe.Rajitha |

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఉన్న బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (BARC)ను విస్తరించేందుకు ఆ సంస్థ నిర్ణయించింది.

ఏపీలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ విస్తరణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఉన్న బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (BARC)ను విస్తరించేందుకు ఆ సంస్థ నిర్ణయించింది. బార్క్‌ ఇప్పటికే అనకాపల్లిలో సుమారు 3 వేల ఎకరాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వాటిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో అదనంగా 148.15 హెక్టార్లు అంటే సుమారు 366 ఎకరాల భూమిని కేటాయించాలని బార్క్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరింది. అయితే కొత్తగా విస్తరించబోయే ప్రాంగణాన్ని భద్రతా కారణాలతో విశాఖపట్నం సమీపంలోని తూర్పు తీర ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు బార్క్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story