సీఎం చంద్రబాబు చెప్పిన వాళ్ల ప్రయత్నం ఆపడం లేదు: మాజీ మంత్రి ఆగ్రహం

by Jakkula Mamatha |
సీఎం చంద్రబాబు చెప్పిన వాళ్ల ప్రయత్నం ఆపడం లేదు: మాజీ మంత్రి ఆగ్రహం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో జరిగిన రేషన్ బియ్యం అక్రమాల(Ration rice irregularities) పై ప్రభుత్వం(AP Government) దూకుడుగా వ్యవహరిస్తోంది. తాను కేసులకు భయపడి ఎక్కడికీ పారిపోలేదు అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ నేపథ్యంలో నేడు(శనివారం) మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా తన పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. దీని పై తాను న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు. శాఖ పరమైన విచారణ కంటే సోషల్ మీడియా విచారణ ఎక్కువగా కనిపిస్తుందని పేర్ని నాని(Former Minister Perni Nani) ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన భార్య గోదాములో సివిల్ సప్లై అధికారులు ధాన్యం ఉంచిన మాట వాస్తవమేనని, అయితే అందులో మిస్ అయిన వాటికి డబ్బులు చెల్లించామని తెలిపారు. తాము నైతికంగా బాధ్యత వహిస్తూనే ఈ డబ్బులు చెల్లించామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. కోర్టులో ముందస్తు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. తాము ఆ బియ్యం దొంగిలించినట్లు ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు. న్యాయపరంగానే ఈ కేసులో పోరాడతామని పేర్ని నాని పేర్కొన్నారు. నా భార్యను అరెస్ట్ చేయించాలని ఓ మంత్రి చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) దగ్గర కూడా ఈ విషయం చర్చించామని తెలిపారు. మహిళల జోలికి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పారని.. సీఎం చెప్పినప్పటికీ వాళ్లు ప్రయత్నాలు ఆపడం లేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed