- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ వెంట్రుక కూడా పీకలేరు..మరోసారి రోజా సంచలన వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..గతంలో తాను పవన్‌పై చేసిన కామెంట్లను సమర్దించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..గతంలో తాను పవన్‌పై చేసిన కామెంట్లను సమర్దించుకున్నారు. జగన్ వేలికి ఉన్న వెంట్రుకను కూడా పవన్ కల్యాణ్ పీకలేడని గతంలో రోజా వ్యాఖ్యానించగా అందులో తప్పేముందని అన్నారు. ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్‌ను ఛాలెంజ్ చేస్తున్నానని 175 సీట్లలో పోటీ చేసి గెలవాలని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఓడించేందుకే పవన్ కల్యాణ్ పనిచేశాడని అన్నారు.
మోడీ కాళ్లు పట్టుకుని, లోకేష్ కాళ్లుపట్టుకుని గెలిచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ కార్యకర్తలకు కానీ తన కులానికి చెందిన నాయకుల కోసం కానీ పవన్ ఏమీ చేయలేదని అన్నారు. తెలుగు దేశం పార్టీని కాపాడేందుకే పవన్ కల్యాణ్ పనిచేస్తున్నాడని చెప్పారు. జనసేన నాయకులు టీడీపీ నాయకుల గురించి మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూడా తాను ఛాలెంజ్ చేస్తున్నానని జగన్ వేలిపై ఉన్న వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు.






