పదో తరగతి పరీక్షలకు సర్వంసిద్ధం.. విద్యార్థులకు ముఖ్య గమనిక

by Vemula.Srinu Prasad |

ఏపీలో పదో తరగతి పరీక్షలకు సర్వంసిద్ధమైంది. సోమవారం నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు...

పదో తరగతి పరీక్షలకు సర్వంసిద్ధం.. విద్యార్థులకు ముఖ్య గమనిక
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో పదో తరగతి పరీక్షల(Tenth Exams)కు సర్వంసిద్ధమైంది. సోమవారం నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 8.30కే విద్యార్థులు(Student) పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇప్పటికే నిర్వహకులు అలర్ట్ ప్రకటించారు. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు రాయనున్నట్లు పేర్కన్నారు. ఇందులో 3,28,652 మంది బాలురు కాగా 3,12,264 మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,415 కేంద్రాలను రెడీ చేశారు. మొత్తం 3,415 మంది సీఎస్‌లు, 3,415 మంది డీవోలు విధులు నిర్వహించనున్నారు.

210 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల గుర్తింపు

ఇక పరీక్షలు జరుగుతున్న తీరును 38,958 మంది ఇన్విజిలేటర్లు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే 210 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత చర్యలను చేపట్టారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు అబ్జర్వ్ చేయనున్నాయి. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.

Next Story