ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం.. సర్వసిద్ధం

by Vemula.Srinu Prasad |

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో 12 ఏళ్లకోకసారి నిర్వహించే కుంభాభిషేకానికి సర్వం సిద్ధమైంది. మొత్తం మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది..

ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం.. సర్వసిద్ధం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి(Vijayawada Indrakiladri)పై దుర్గగుడి(Durga Temple)లో 12 ఏళ్లకోకసారి నిర్వహించే కుంభాభిషేకానికి(Kumbhabhishekam) సర్వం సిద్ధమైంది. మొత్తం మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఆగమ శాస్త్రం ప్రకారం మార్చి 6,7,8 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ విమాన గోపురాలకు సంప్రోక్షణలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పండితులు వేద మంత్ర సహిత ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి 3 రోజులు ఇక్కడే ఉండి క్రతువును వైభవంగా నిర్వహించనున్నారు. దుర్గగుడిలో 2012లో ఈ కుంభాభిషేకం జరిగింది. అయితే 2014లో ప్రధాన రాజగోపురం ప్రతిష్ఠ జరిగింది. దీంతో 2 ఏళ్ల వ్యవధిలోనే మళ్లీ కుంభాభిషేకం నిర్వహించాల్సి వచ్చింది. అక్కడి నుంచి మళ్లీ ఇన్నాళ్టికి కుంభాభిషేకం నిర్వహించేందుకు సర్వంసిద్ధమైంది.

ఈ సందర్బంగా యాగశాలలో 3 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయంలోని విగ్రహాలు, గోపురాలకు పునరుజ్జీవనం కల్పించడమే కుంభాభిషేకం ప్రధాన ఉద్దేశమని ఆలయ అధికారులు తెలిపారు. తద్వారా సకల నదులు, సముద్రాలు, తీర్థాల జలాలను సేకరించనున్నట్లు తెలిపారు. అంతేకాదు ఆ జలాలతో ఆలయంలోని యాగశాలలో 3 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆ జలాలతో గోపురాలు, కలశాలకు అభిషేకం నిర్వహించనున్నట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. అయితే యాగశాల ప్రాంతంలోకి భక్తులు ఎవరినీ అనుమతించారని వెల్లడించారు. ఇది అంతర్గత కార్యక్రమమని, కానీ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 9 వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 8వ తేదీ వరకు అంతరాలయ దర్శనాల సైతం నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Next Story