‘నాకు బాధ కలిగిన ప్రతిసారి ఆయన దగ్గరకే వెళ్తా’.. సినీ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-21 07:30:59  IST  )

సినీనటి, బిగ్‌బాస్ ఫేం దివి ఇవాళ(శనివారం) తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

‘నాకు బాధ కలిగిన ప్రతిసారి ఆయన దగ్గరకే వెళ్తా’.. సినీ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: సినీనటి, బిగ్‌బాస్ ఫేం దివి ఇవాళ(శనివారం) తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మొదటగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఆమె శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకెప్పుడు ఏ బాధ వచ్చినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తానని ఆమె తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని చూసిన వెంటనే అన్ని బాధలు కష్టాలు మాయమవుతాయని అన్నారు. సినీ నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కోరిక తిరుపతిలో కోరుకున్నాదే అని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి.. అవి జరిగే వరకు కోరికలు ఎవరికీ చెప్పకూడదని అన్నారు. బిగ్‌బాస్ ఫేం దివిని అక్కడ చూసిన భక్తులు ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఆమె భక్తులతో సెల్ఫీ దిగింది.

Insta Link

Next Story