- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పక్షి ఈక రాలిపడినా పెద్ద వార్త అయిపోతుంది : డిప్యూటీ సీఎం
పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.

దిశ, వెబ్ డెస్క్ : పిఠాపురంలో చిన్న చెట్టు మీద పక్షి ఈక రాలిపడినా పెద్ద వార్త అయిపోతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు. పిఠాపురంలో తాటాకు చప్పుడు కూడా వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరో వచ్చి ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి మానవ సంబంధాలు చెడగొట్టాలని చూస్తున్నారన్నారు. ప్రజలు ఇదంతా గమనించాలని కోరారు. ఏ ప్రముఖ నాయకుడి నియోజకవర్గంలో కూడా ఇలా జరగదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పిఠాపురం నియోజకవర్గానికి ఎన్ని కోట్లు కేటాయించి పనులు చేశారో ప్రజలు పరిశీలించాలన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన కేవలం ఏడాదిలోనే రూ.308 కోట్లను నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించానని తెలిపారు. మార్చి నాటికి పనులు కూడా పూర్తి చేస్తామన్నారు.
నియోజకవర్గంలో లేకపోయినా..
డిప్యూటీ సీఎం హోదాలో తనకు చాలా బాధ్యతలుంటాయని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను నియోజకవర్గంలో ఉన్నా లేకపోయినా పనులు పూర్తయ్యే వ్యవస్థ ఏర్పాటు చేయడం ముఖ్యంగా భావిస్తానని తెలిపారు. తాను ఉంటేనే, తనను కలిస్తేనే పనులు అవుతాయి అనుకుంటే అది తన పరిపాలన వైఫల్యంగా భావిస్తానని తెలియజేశారు. పిఠాపురం సింగపూర్ తరహాలో వ్యక్తి మీద ఆధారపడకుండా వ్యవస్థలా పనిచేసేలా తీర్చిదిద్దుతున్నాం అన్నారు.
వివాదాల్లోకి వెళ్లకండి..
గత వైసీపీ నాయకులు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి రాజకీయం చేశారన్నారు. ప్రభుత్వం మారినా కూడా ఆ పార్టీ నాయకుల్లో ఇంకా మార్పు రాలేదన్నారు. కాబట్టి ప్రజలు వారి కుట్రల్లో చిక్కి.. వారి మాటలను నమ్మి వివాదాల్లోకి వెళ్లొద్దని మనవి చేశారు.
జాతీయ స్థాయిలో వినపడేలా
నేను పిఠాపురం నుంచి గెలిచి జాతీయ స్థాయిలో జనసేన పేరు వినపడేలా పనిచేస్తున్నానని డిప్యూటీ సీఎం తెలిపారు. తనను, జనసేనను పిఠాపురం వరకు పరిమితం చేయకండని పార్టీ శ్రేణులను కోరారు. నేను పేరంటాలకు, ఫంక్షన్లకు అటెండ్ కావడం కంటే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. తాను ఎక్కడా ఉన్నా తన గుండెల్లో పిఠాపురం ఉంటుందనే విషయం పిఠాపురం ప్రజలు గుర్తుపెట్టుకోవాలని విన్నవించారు.
పెద్ద వార్త చేశారు
పిఠాపురంలోని ఒక స్కూళ్లో ఇద్దరు చిన్నపిల్లలు మాట మాట అనుకుని కొట్టుకుంటే అది పెద్ద వార్త చేసి అది కూడా తన బాధ్యత అంటారని, పులివెందులలో సొంత బాబాయి హత్యకు గురైతే అది వార్త అవ్వదని వైయస్ జగన్ పై పరోక్ష విమర్శలు చేశారు. నాయకులే కొట్టుకుంటుంటే స్కూల్లో ఇద్దరు పిల్లలు మాట మాట అనుకోకుండా ఉంటారా? అది కూడా పెద్ద గొడవలా మార్చాలని ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు ఏదో అనుకుంటే దానిలోకి కులాలను తీసుకొస్తారా? అని నిలదీశారు. నాయకులు కూడా ఈ విషయాలపై ఆలోచించాలని సూచించారు.
ప్రొటెక్షన్ వాల్ వచ్చేదా
ఎన్నికలు అయిపోయాయి అని వదిలేస్తే ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ వచ్చేదా అని ప్రజలను డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, గోవా, తమిళనాడు, ఒరిస్సా, బెంగాల్ ఇలా ఎన్నో రాష్ట్రాల్లో తీర ప్రాంత గ్రామాలు కోతకు గురవుతుంటే కేవలం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతానికి ప్రొటెక్షన్ వాల్ తీసుకురాగలిగాం అని స్పష్టం చేశారు. అంటే తనకు పిఠాపురం ప్రజలపై, ఉప్పాడ ప్రజలపైనున్న ప్రేమ కేంద్రాన్ని ఒప్పించేలా చేసిందన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి ఈ వాల్ అవసరం అని చెప్పి ఈ ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ ప్రాజెక్ట్ సాధించానని తెలియజేశారు.
ప్రజలందరికీ అభివృద్ధి
కేవలం 40 కుటుంబాలు ఉండే గిరిజన గ్రామాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకం PM JANMAN ద్వారా 75 సంవత్సరాల తరవాత కరెంట్ ఇచ్చి రోడ్లు వేశామని డిప్యూటీ సీఎం తెలియజేశారు. ఇది తను పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన బలం, తన నిబద్ధత అని చెప్పారు. కేవలం పిఠాపురానికి పరిమితం అయితే ఇది చేయగలిగేవాడిని కాదని.. తాను అన్ని ప్రాంతాలకు, ప్రజలందరికీ అభివృద్ధి అందించే అవకాశం పిఠాపురం ప్రజలు అందించారని ప్రకటించారు.
ఓడించడానికి వచ్చారు
తాను పిఠాపురంలో పోటీ చేస్తా అని ప్రకటించగానే తనను ఓడించడానికి పులివెందుల నుంచి, చిత్తూరు నుంచి నాయకులు వచ్చి పని చేశారని గుర్తు చేశారు. మనం మాత్రం వారి నియోజకవర్గాల్లోకి రాకూడదు అన్నారన్నారు.
సమస్యలు చూసి వచ్చిన వ్యక్తిని
తాను నల్గొండ ఫ్లోరోసిస్ లాంటి ఎన్నో సమస్యలు చూసి ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని అని డిప్యూటీ సీఎం తెలిపారు. తన సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బులు వచ్చే శక్తి ఉన్న స్టార్ డం ఉన్న వ్యక్తిని అని స్పష్టం చేశారు. అలాంటిది రాజకీయాల్లోకి రావడానికి కారణం నా ఆవేదన, బాధ్యత అని కుండ బద్ధలుగొట్టారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రజల ప్రేమను తీసుకెళ్లండి, వారికి ఇక్కడి ప్రజల ఆత్మీయతను జనసేన పార్టీ తెలంగాణ నాయకులు అందించాలని కోరారు.
Read More..






