- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం జిల్లాలో (Visakapatnam) భూకబ్జాదారులు (Land Grabbers) రెచ్చిపోయారు. తమ ఆగడాలతో స్థానికంగా కలకలం రేపారు. అధికారులపై సైతం దాడులకు తెగబడి బెంబేలెత్తించారు. పోలీసుల వివరాల ప్రకారం పెందుర్తి మండలం చింతగట్ల (Chinthagatla) ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. సర్వే నెంబర్ 57/1, 57/2 లో అక్రమ నిర్మాణాలను చేపట్టారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వాటిని తొలగించేందుకు అక్కడకు వెళ్లారు. జేసీబీతో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే భూమిని కబ్జా చేసిన వారు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలతో రెవెన్యూ అధికారులు దాడికి యత్నించారు.
వారి దాడిలో జేసీబీ పాక్షికంగా ధ్వంసం అయ్యింది. కబ్జాదారుల వ్యవహారంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో రెవెన్యూ అధికారులు పరుగు లంఘించుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి సహాయం కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడికి పాల్పడిన నిందితులను ఎంఆర్ఓ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.






