- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆఫీసునే బార్‌గా మార్చిన ప్రభుత్వ ఉద్యోగి.. వీడియో వైరల్
కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ సమయంలో పనిచేయకుండా ఎంజాయ్ చేస్తుంటారు. మమ్మల్ని ఎవరు అడుగుతారు

X
దిశ, వెబ్ డెస్క్: కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ సమయంలో పనిచేయకుండా ఎంజాయ్ చేస్తుంటారు. మమ్మల్ని ఎవరు అడుగుతారు అనుకుంటారో లేదా మమ్మల్ని ఎవరు చూస్తారు అనుకుంటారో ఏమో కానీ దేనిని పట్టించుకోకుండా హ్యాపీగా చిల్ అవుతుంటారు. కొందరు అయితే ఆఫీసునే బార్ గా మార్చేస్తారు. అలాంటి ఓ ఘటనే ఏపీలోని కర్నూలులో జరిగింది.
ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఓ ఉద్యోగి డ్యూటీ సమయంలో మద్యం తాగాడు. సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి ఏకంగా తన ఛాంబర్ లోనే కూర్చుని ఎంజాయ్ చేశాడు. ఆయన పక్కన ఓ పోలీస్ అధికారి సైతం ఉండటం ఆశ్చర్యకరం. ఓ వ్యక్తి అధికారి మద్యం తాగుతున్న సమయంలో మాటల్లో పెట్టి వారికి తెలియకుండా వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో అధికారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. VIDEO
Next Story






