- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చిన ఎన్నికల ఫలితాలు!
విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును టీడీపీ కార్యకర్తలు మార్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును టీడీపీ కార్యకర్తలు మార్చారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యూనివర్సిటీల పేర్లను కూడా మార్చుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం నమోదు చేసుకునే దిశగా పరుగులు తీస్తోంది. పలు సంస్థల ఎక్జిట్ పోల్స్ అంచనాలను కూడా తిరగేసి టీడీపీ భారీ విజయం దిశగా దూసుకొని పోతోంది. దీంతో టీడీపీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నేపధ్యంలోనే విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మర్చేశారు. యూనివర్సిటీ భవనంపై ఉన్న వైఎస్ఆర్ పేరును పడగొట్టి దాని స్థానంలో ఎన్టీఆర్ అని పెట్టేశారు. దీంతో ఈ యూనివర్సిటీ తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారిపోయింది. ఇక గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్న దీని పేరును జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చి పలు విమర్శల పాలైన విషయం తెలిసిందే.






