- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. మంత్రితో మాట్లాడుతుండగా గుండెపోటు
by Gantepaka Srikanth |
రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. మంత్రితో మాట్లాడుతుండగా గుండెపోటు

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు(Guntur) జిల్లా మందడంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంత్రి నారాయణ(Minister Narayana) శుక్రవారం మందడంలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన రాములు అనే వృద్ధుడు మంత్రి వద్దకు వచ్చారు. మంత్రి నారాయణతో గోడు వెళ్లబోసుకున్నాడు. ‘మీకు(ప్రభుత్వానికి) మా స్థలాలు ఇచ్చి బొచ్చెలు పట్టుకుని అడుక్కోవాల్సి వస్తోంది’ అని మంత్రి ఎదుటే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మంత్రితో మాట్లాడుతూనే గుండెపోటు(Heart Attack)తో కుప్పకూలాడు. సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అక్కడికక్కడే గుండెపోటుతో వృద్ధుడు రాములు కన్నుమూశారు. దీంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. అనూహ్య ఘటనతో మంత్రి కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.
Next Story






