- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: కలెక్టరేట్‌లో కలకలం.. పెట్రోల్ పోసుకుని వృద్ధుడు ఆత్మహత్యాయత్నం
తన ఇళ్లు ఆక్రమణపై ఫిర్యాదు చేయడానికి వస్తే సాక్షత్తు కలెక్టర్ కార్యాలయం అధికారులే పట్టించుకోవడంలేదని ఓ వృద్ధుడు మనస్థాపం చెందారు. ఇక ఎవరూ తనకు న్యాయం చేయలేరనే నిర్ణయానికి వచ్చేశారు..

దిశ, వెబ్ డెస్క్: తన ఇళ్లు ఆక్రమణపై ఫిర్యాదు చేయడానికి వస్తే సాక్షత్తు కలెక్టర్ కార్యాలయం అధికారులే పట్టించుకోవడంలేదని ఓ వృద్ధుడు మనస్థాపం చెందారు. ఇక ఎవరూ తనకు న్యాయం చేయలేరనే నిర్ణయానికి వచ్చేశారు. తీవ్ర ఆవేదనతో చావు రేవో తేల్చుకోవాలనుకున్నారు. పెట్రోల్ బాటిల్‌తో డైరెక్ట్‌గా కలెక్టర్‌కు వెళ్లారు. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వృద్ధుడు నుంచి స్థానికులు పెట్రోల్ సీసాను లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగింది.
గుంటూరు ఫిరంగిపురంలో...
గుంటూరు ఫిరంగిపురానికి చెందిన దాసరి పాపయ్య అనే వ్యక్తికి సంబంధించిన ఇంటిని కొందరు ఆక్రమించారు. రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. అంతేకాకుండా ఇంటి నుంచి బయటకు నెట్టేశారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఆయన ఫిర్యాదు అయితే పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో కలెక్టరేట్‌లోనైనా తనకు న్యాయం జరుగుతుందని అక్కడికి వెళ్లారు. అక్కడా నిరాశ ఎదురుకావడంతో చనిపోయేందుకు ప్రయత్నం చేశారు. స్థానికులు అడ్డుకోవడంతో పాపయ్య సురక్షితంగా బయటపడ్డారు. అయితే పాపయ్య ఆవేదనపై స్థానికులు సైతం చలించిపోయారు. అధికారులు వెంటనే పాపయ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే పాపయ్య కు జరిగిన అన్యాయం కలెక్టరేట్‌లోని అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలోనే సమస్యకు పరిష్కారం చేపుతారని కలెక్టర్ కార్యాలయం సిబ్బంది చెప్పినట్లుగా సమాచారం. చూడాలి మరి పాపయ్యకు ఎంతవరకూ న్యాయం జరుగుతుందో.






