- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇకపై కోయ భాషలో విద్యా బోధన
ఏపీ సర్కార్(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సర్కార్(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. శబరి, గోదావరి నదుల వెంబడి ఎంపిక చేసిన 12 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కోయ భాష(Koya Language)లో బోధించడానికి 15 మంది కోయ మాతృభాష మాట్లాడే వారిని నియమించాలని నిర్ణయించింది. ఈమేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ITDA)కు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్యుల్ ఎడ్యుకేషన్ (MTB-MLE) కింద జరగనుంది. వి.ఆర్. పురం మండలంలోని ఆరు పాఠశాలలకు ఏడుగురు, యేటపాక మండలంలోని ఐదు పాఠశాలలకు ఏడుగురు, చింతూరు మండలంలోని వెగితోట ప్రాథమిక పాఠశాలకు ఒక నేటివ్ స్పీకర్ ను నియమించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(SMC) ఆయా గ్రామాల్లో నివసించే కోయ భాష మాట్లాడే వారిని గుర్తించి, వారికి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ నుండి గౌరవ వేతనం చెల్లిస్తుంది. కోయ తెగల విద్యార్థులకు (ముఖ్యంగా 1 నుండి 3వ తరగతి విద్యార్థులు) వారి మాతృభాషలో విద్యను అందించడం, వారి సాంస్కృతిని, వారసత్వాన్ని రక్షించడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.






