- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సభలు, సమావేశాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి:DSP
by Jakkula.Mamatha |
పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని డీఎస్పీ సుంకర మురళీమోహన్ తెలిపారు

X
దిశ, కొత్తపేట : పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని డీఎస్పీ సుంకర మురళీమోహన్ తెలిపారు. ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సెక్షన్ 30 ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. కొత్తపేట సబ్ డివిజన్ పరిధిలోని రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, పి. గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, నగరం పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలకు ఈ యాక్ట్ వర్తిస్తుందని వివరించారు. పోలీసు హెచ్చరికలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story






