- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు మంత్రి సుభాష్ విజ్ఞప్తి
మొంథా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో తుఫాను కారణంగా ఏర్పడే నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) అన్ని చర్యలను చేపడుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో తుఫాను కారణంగా ఏర్పడే నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) అన్ని చర్యలను చేపడుతోంది. కంట్రోల్ రూంల (Control Room) ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తుఫాను సంబంధిత సమాచారాన్ని ఇస్తోంది. అంతేకాకుండా తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. ఈ క్రమంలో రామచంద్రాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subash) తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తుఫాను కారణంగా కలిగే ప్రమాదాన్ని వివరిస్తున్నారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను (Rehabilitation Center) ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారంతో పాటు ఇతర వసతులు కూడా ఉంటాయని చెబుతున్నారు. తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే తిరిగి ఇంటికి చేరుకోవచ్చని వివరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా ఉన్నందున ప్రభావిత ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






