- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధిత రైతులకు తక్షణ సహాయం అందజేయాలి
మొంథా తుఫాను కారణంగా పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పంట నష్టం వాటిల్లింది.

X
దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను కారణంగా పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పంట నష్టం వాటిల్లింది. వైకాపా నేత, మాజీ ఎంపీ వంగ గీత (Vanga Geeta) దుర్గాడ గ్రామంలో పర్యటించి బాధిత రైతులతో మాట్లాడారు. తుఫాను తీవ్రత కారణంగా దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కూరగాయల పంటలను, బంతి తోటలను పరిశీలించారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పంట నష్టం కారణంగా రైతులు (Farmers) ఆవేదనకు గురవుతున్నారన్నారు. ఆరుగాలం పండించిన పంట వర్షం కారణంగా నష్టపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వారికి నష్ట పరిహారాన్ని చెల్లించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. పంట నష్టపోయిన బాధిత రైతులకు తక్షణ సహాయం అందజేసి వారిని ఆదుకోవాలని అధికారులను కోరారు.
READ MORE .....
Next Story






