కాకినాడ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ రవాణా.. తనిఖీల్లో అధికారులకు బిగ్ షాక్

by Vemula.Srinu Prasad |

కాకినాడ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. ఈ మేరకు వచ్చిన సమాచారంతో సివిల్ సప్లై అధికారులు పోర్టు ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు..

కాకినాడ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ రవాణా.. తనిఖీల్లో అధికారులకు బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ పోర్టు(Kakinada Port) వేదికగా రేషన్ బియ్యం(Ration Rice) అక్రమ రవాణా సాగుతోంది. ఈ మేరకు వచ్చిన సమాచారంతో సివిల్ సప్లై(Civil Supply) అధికారులు పోర్టు ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఐదు లారీల రేషన్ బియ్యాన్ని రెడ్ హ్యాండెడ్‌గా గుర్తించారు. సుమారు 140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు వినియోగిస్తున్న వాహనాలను సీజ్ చేశారు. అధికారుల రాకను గమనించిన కొందరు అక్కడి నుండి పరారైనట్లు సమాచారం.

తనిఖీల్లో అధికారుల విస్మయం

అయితే ఈ తనిఖీల్లో అధికారులు విస్మయానికి గురయ్యారు. పట్టుబడిన బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ (పోషక విలువలతో కూడిన బియ్యం) కలిసి ఉండటాన్ని గుర్తించారు. పేదల బియ్యాన్ని కూడా అక్రమార్కులు రీ-సైక్లింగ్ చేయడంపై షాక్‌కు గురయ్యారు. ఈ రవాణా వెనుకున్న సూత్రధారులెవరు అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. పోర్టు అధికారులు, రవాణా ఏజెంట్ల పాత్రపైనా ఆరా తీస్తున్నారు. బియ్యం నాణ్యతను పరీక్షించి నివేదిక ఆధారంగా నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. పేదల బియ్యాన్ని అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

Next Story