కాకినాడ ఓడరేవుకు తుఫాను ప్రమాద హెచ్చరిక

by Thanuru Gopichand |

మొంథా తుఫాను నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

కాకినాడ ఓడరేవుకు తుఫాను ప్రమాద హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కాకినాడ తీరంలో తుఫాను తీరం దాటనుందన్న వాతావరణ శాఖల హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు. యాంకరేజ్ పోర్టు, కాకినాడ డీప్ సీ పోర్టును ఖాళీ చేయించారు. వివిధ వస్తువుల దిగుమతులతో ఉన్న నౌకలను సముద్రంలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. హోప్ ఐలాండ్ లో నివసిస్తున్న మత్య్సకారులను కాకినాడ సమీపంలో తూరంగి కాలనీకి తరలించారు. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు సురక్షిత ప్రాంతాలను గుర్తించారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉండేందుకు అన్ని ఏర్పాట్లను చేశామని ప్రత్యేక అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని కోరారు. తుఫాను ప్రభావాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Next Story