మరోసారి రెచ్చిపోయిన దువ్వాడ దివ్వెల..సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-21 09:03:57  IST  )

దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి వీరిద్ద‌రూ ఎంత ఫేమ‌సో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ అదే పార్టీకి చెందిన మ‌హిళా నేత దివ్వెల మాధురితో ప్రేమ‌లో ప‌డి పార్టీ నుండి స‌స్పెండ్ అయ్యారు.

మరోసారి రెచ్చిపోయిన దువ్వాడ దివ్వెల..సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి వీరిద్ద‌రూ ఎంత ఫేమ‌సో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ అదే పార్టీకి చెందిన మ‌హిళా నేత దివ్వెల మాధురితో ప్రేమ‌లో ప‌డి పార్టీ నుండి స‌స్పెండ్ అయ్యారు. దువ్వాడ‌కు అప్ప‌టికే పెళ్లై పెళ్లీడుకు వ‌చ్చిన కూతుళ్లు ఉండ‌గా, దివ్వెల మాధురికి పెళ్లై ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయిన‌ప్పకీ భార్య పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోకుండా దువ్వాడ‌, భ‌ర్త‌ను వ‌దిలేసి దివ్వెల సోష‌ల్ మీడియాలో వీడియోలు చేయ‌డం, పార్టీకి న‌ష్టం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించ‌డంతో జ‌గ‌న్ పార్టీ నుండి స‌స్పెండ్ చేశారు.

ఇక ఇప్పుడు ఈ జంట ఫుల్ టైమ్ రీల్స్ చేస్తూ, టీవీ షోల‌కు అటెండ్ అవుతూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవ‌ల వీరిద్ద‌రూ ఓ డ్యాన్స్ ప్రోగ్రాంలో స్టెప్పులు వేయ‌గా వీడియో వైర‌ల్ అయ్యింది. కాగా తాజాగా వీరిద్ద‌రికి సంబంధించిన మ‌రో వీడియో వైర‌ల్ అవుతోంది. ఓ బైక్ షో రూం ముందు కొత్త బైక్ కొనుగోలు చేసిన సంద‌ర్భంగా దువ్వాడ దివ్వెల‌తో టెస్ట్ డ్రైవ్ చేశారు. ఇద్ద‌రూ మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్సులో వీడియోలో మెర‌వ‌గా నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

వీడియో :

Next Story