దుర్గగుడి ఘాట్ రోడ్డు మరమ్మత్తులకు బ్రేక్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-28 10:59:34  IST  )

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎండలు, వడగాల్పుల తీవ్రత విపరీతంగా ఉన్నందున పనులను కొనసాగించలేమని రోడ్లు, భవనాల శాఖ చేతులెత్తేసింది..

దుర్గగుడి ఘాట్ రోడ్డు మరమ్మత్తులకు బ్రేక్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు(Vijayawada Kanakadurgamma Temple Ghat Road) మరమ్మత్తు పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎండలు, వడగాల్పుల తీవ్రత విపరీతంగా ఉన్నందున పనులను కొనసాగించలేమని రోడ్లు, భవనాల శాఖ(Roads, Buildings Department) స్పష్టం చేసింది. ఈ మేరకు పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దుర్గగుడి దేవస్థాన అధికారులకు అధికారికంగా లేఖను పంపారు. తీవ్రమైన ఎండల సమయంలో ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేపడితే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని ఆర్&బీ అధికారులు లేఖలో పేర్కొన్నారు. అధిక వేడి వల్ల సిమెంట్లు, బీటీ రోడ్డు పనులు సజావుగా సాగవని, రోడ్డు త్వరగా పగుళ్లు ఇచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. అందువల్ల వాతావరణం సాధారణ స్థితికి వచ్చి, ఎండల తీవ్రత తగ్గే వరకు మరమ్మత్తుల షెడ్యూల్‌ను మార్చాలని వారు కోరారు. ఆర్&బీ శాఖ నిర్ణయంతో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను పునరుద్ధరించనున్నారు. శుక్రవారం నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్డు యథావిధిగా భక్తులకు అందుబాటులోకి రానుందని,. దీనివల్ల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఘాట్ రోడ్డు గుండా వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు తెలిపారు.

Next Story