- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ జిల్లాలో తొలి డిజిటల్ అరెస్ట్’.. DSP సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు మరింత ఆధునాతనంగా మారుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు మరింత ఆధునాతనంగా మారుతున్నాయి. ఈ క్రమంలో డిజిటల్ అరెస్ట్ అనే మోసం దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించి పెద్ద సమస్యగా మారింది. డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలు చేస్తున్నారని డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh)లోని శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లోని లేడీ డాక్టర్‌ను కొందరు దుండగులు బెదిరించి రూ.13.5లక్షలు వసూలు చేశారని తెలిపారు. ఈ తరుణంలో పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి.. శ్రీకాకుళం జిల్లాలో తొలి డిజిటల్ అరెస్టు మోసాన్ని చేధించామని డీఎస్పీ వెల్లడించారు. ఈ క్రమంలో నిందితులు కేరళకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వివేకానంద తెలిపారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని అన్నారు. డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ పోలీసుశాఖలో ఉండదన్నారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్టులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






