- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ద్రోణి ఎఫెక్ట్'.. ఏపీకి ఉరుములతో కూడిన భారీ వర్షాలు.!
బుధవారం రోజున జార్ఖండ్ తో పాటుగా... దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిషా, చత్తీస్ ఘడ్ పై గల ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.

దిశ, వెబ్ డెస్క్: బుధవారం రోజున జార్ఖండ్ తో పాటుగా... దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిషా, చత్తీస్ ఘడ్ పై గల ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. అయితే సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి రాయలసీమ ప్రాంత అంతర్భాగం గుండా కొమోరిస్ ప్రాంతం వరకూ తక్కువగా గుర్తించబడింది.
రాబోవు మూడు రోజుల్లో..
ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో..
ఈ రోజు: తేలికపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇంకా ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 - 40 కి.మీ ల వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు మరియు ఎల్లుండి: కొన్ని ప్రాంతాల్లోనే ఉరుములు మెరుపులతో కూడిన బలమైన గాలులు గంటకు 30 -40 కి. మీ ల వేగంతో వీస్తాయి.
రాయలసీమ ప్రాంతంలో...
ఈ రోజు, రేపు: తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులతో గంటకు 30 - 40 కి.మీ ల వేగంతో ఒకటి రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి: ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం, దీంతో పాటుగా ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది.






