మహిళల మిస్సింగ్‌పై నిర్లక్ష్యం వద్దు.. బాధ్యతతో మెలగండి: డీఎస్పీలతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

by Disha Web Desk 21 |
మహిళల మిస్సింగ్‌పై నిర్లక్ష్యం వద్దు.. బాధ్యతతో మెలగండి: డీఎస్పీలతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రతీ పోలీస్ అధికారి బాధ్యతగా మెలగాలని...ప్రజలకు అండగా ఉంటామనే భరోసాను ఇవ్వాలని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. డీఎస్పీ శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ఉద్దేశించి డీజీపీ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి...క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులను జాగ్రత్తగా ఎదుర్కొంటూ.. ప్రజలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని డీజీపీ సూచించారు. మరోవైపు మహిళల అదృశ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని.... ఫిర్యాదు వచ్చిన మరుక్షణం సీరియస్‌గా స్పందించాలని డీజీపీ ఆదేశించారు. ఎవరైనా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల మంది మహిళలు దిశా యాప్ ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన పోకడలు సంతరించుకున్నాయి అన్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాలు, లోన్ యాప్ అక్రమాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అలాంటి నేరస్థులను వదిలిపెట్టేది లేదని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా సైబర్ నేరాలు, లోన్ యాప్ అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు.


Next Story

Most Viewed