Ap: పెట్రోల్ ‘టెన్షన్’ వద్దు.. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు..!

by Vemula.Srinu Prasad |

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, ఆయిల్ కంపెనీల వద్ద సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు...

Ap: పెట్రోల్ ‘టెన్షన్’ వద్దు.. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ(AP Petrol Dealers Association President Ravi Gopalakrishna) స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో ఇంధన కొరత(Fuel shortage) లేదని, ఆయిల్ కంపెనీల వద్ద సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. సప్లై ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా, సకాలంలో బంకులకు ఇంధనం చేరేలా ప్రభుత్వం ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. కేవలం కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడ సరఫరాలో స్వల్ప ఆలస్యం జరిగితే, వాటిని వెంటనే పరిష్కరించి ఇంధనం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు

సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని రావి గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. అనవసర భయాందోళనలతో పెట్రోల్ బంకుల వద్ద గుమిగూడి రద్దీని పెంచవద్దని ఆయన కోరారు. ఇంధన సరఫరా నిరంతరం కొనసాగుతుందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అసోసియేషన్, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన భరోసా ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందకుండా తమకు అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని రావి గోపాలకృష్ణ సూచించారు.

Next Story