- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల భద్రతలో డాగ్ స్క్వాడ్ కీలకం.. హోం మంత్రి అనిత
ప్రజల భద్రతలో డాగ్ స్క్వాడ్ కీలక పాత్ర పోషిస్తుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.

మంగళగిరి 6వ బెటాలియన్లోపాసింగ్ పరేడ్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల భద్రతలో డాగ్ స్క్వాడ్ కీలక పాత్ర పోషిస్తుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంగళగిరి 6 బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్ ఇవాళ ఉదయం నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. పోలీసుల నుంచి హోం మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు జాగిలాలు ప్రదర్శన, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సంద ర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ టెక్నాలజీ చేయలేని పనులు స్నిఫర్ డాగ్స్ చేస్తాయన్నారు. శిక్షణ తర్వాత 35 జాగిలాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. డీజీపీ హరీశ్కుమార్గుప్తా మాట్లాడుతూ ఏపీ పోలీస్ చరిత్రలో డ్రగ్స్ ను కూడా గుర్తించేలా జాగిలాలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ పూర్తిగా నిరోధించేలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. నిరంతరం పోలీస్నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల సంఖ్య తగ్గించామని డీజీపీ పేర్కొన్నారు.






