నా రాజా కోసమే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకున్నా.. ఆయనను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను: దివ్వెల మాధురి

by Ajay Maddhiboyina |

బిగ్ బాస్ సీజ‌న్ 9 ప్రారంభం అవ్వ‌క‌ముందు నుండే మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దివ్వెల మాధురి హౌస్ లో అడుగుపెడుతున్నారంటే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్ప‌టికే సీజ‌న్ మొద‌లైంది. దీంతో దివ్వెల మాధురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు అంటూ నెట్టింట జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

నా రాజా కోసమే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకున్నా.. ఆయనను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను: దివ్వెల మాధురి
X

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజ‌న్ 9 ప్రారంభం అవ్వ‌క‌ముందు నుండే మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (duvvada srinivas) రెండో భార్య దివ్వెల మాధురి (divvela madhuri) హౌస్ లో అడుగుపెడుతున్నారంటే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్ప‌టికే సీజ‌న్ మొద‌లైంది. దీంతో దివ్వెల మాధురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు అంటూ నెట్టింట జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ఎంట్రీపై దివ్వెల మాధురి క్లారిటీ ఇచ్చారు. తాను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్ట‌కపోవ‌డానికి ఓ కారణం ఉంద‌ని చెప్పారు. అది త‌న భ‌ర్త‌ను వ‌దిలి ఉండ‌లేకపోవ‌డ‌మే అన్నారు.

నా రాజాను వ‌దిలి ఉండ‌లేను, అందుకే బిగ్ బాస్ ఛాన్స్ వ‌చ్చినా వ‌దులుకున్నా అంటూ స్ప‌ష్టం చేశారు. ఉద‌యం లేచినప్ప‌టి నుండి రాత్రి వ‌ర‌కు అత‌డితోనే గ‌డుపుతాన‌ని తెలిపారు. ఆయ‌న‌కు వండిపెట్ట‌డం, ప్ర‌తిరోజు ఆయ‌న‌ను చూసుకోవ‌డం త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పారు. ఆయ‌న ఎక్క‌డికి వెళితే అక్క‌డికి వెళ‌తానని అన్నారు. ప్ర‌తినెల టెక్క‌లిలో ప‌ర్య‌టిస్తామ‌ని ప్ర‌జ‌ల‌ను క‌లుస్తామ‌ని అన్నారు. అంతే కాకుండా ప్ర‌తినెల ఏదో ఒక టూర్ వెళ‌తామ‌ని చెప్పారు. నెల‌కు 10 రోజులు ఎక్క‌డికైనా ట్రావెల్ చేస్తామ‌ని తెలిపారు.

ఇద్ద‌రికీ ట్రావెలింగ్ ఇష్ట‌మ‌ని అందుకే ఏదో ఒక ట్రిప్ కు వెళ‌తామ‌ని చెప్పారు. ఇదిలా ఉంటే దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ను వివాహం చేసుకుని వార్త‌ల్లో నిలిచారు. లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ‌తో హాట్ టాపిక్ గా మారారు. శ్రీనివాస్ త‌న భార్య పిల్ల‌ల‌ను వ‌దిలేసి మ‌రీ దివ్వెల మాధురితో తిర‌గ‌టం, రీల్స్ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలోనూ వీరి వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్ర‌మంలోనే దివ్వెల మాధురి గ‌తంలో చేసిన డ్యాన్స్ వీడియోలు వైర‌ల్ అయ్యాయి. కొద్దిరోజుల్లోనే ఆమె సోష‌ల్ మీడియా స్టార్ గా మారారు. ఆ త‌ర‌వాత ప‌లు యూట్యూబ్ ఛానళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చి స్టార్ క‌పుల్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే దివ్వెల‌కు బిగ్ బాస్ ఆఫ‌ర్ కూడా వ‌చ్చిన‌ట్టు వార్త‌లు మొద‌ల‌య్యాయి.

Next Story