దిత్వా ఎఫెక్ట్‌..ఇవాళ‌ ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

by velandi.Saikiran |

రీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కడప, అ

దిత్వా ఎఫెక్ట్‌..ఇవాళ‌ ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీపై దిత్వా తుఫాన్ ( Cyclone Ditwah ) ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తుఫాన్‌ కారణంగా ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. అటు దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో నంద్యాల, అనంతపురం, కర్నూలు, పల్నాడు, బాపట్ల, శ్రీ సత్య సాయి జిల్లాలో మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో వర్ష ప్రభావిత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు ఈ దిత్వా తుఫాన్.. నైరుతి బంగాళాఖాతం, దానికి అనుకొని ఉన్న శ్రీలంక తీరంలో నెమ్మదిగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆదివారం తెల్లవారుజామునకు ఈ తుఫాన్‌, వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా అంచనా వేస్తోంది. దిత్వా తుఫాన్‌ తీవ్రవాయుగుండంగా మారిన తర్వాత, దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఇలాంటి నేపథ్యంలో మంగళవారం వరకు సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు కూడా జారీ చేసింది వాతావ‌ర‌ణ శాఖ‌. దిత్వా తుఫాన్ కార‌ణంగా ఏపీలో వ‌ర్షం ముప్పు ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భిన్న‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. రెండు రోజుల నుంచి చ‌లి తీవ్ర‌త మ‌ళ్లీ పెరిగింది. చాలా జిల్లాల్లో 5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ల నుంచి 10 డిగ్రీల మ‌ధ్య న‌మోదు అవుతోంది. దీంతో జ‌నాలు వ‌ణికిపోతున్నారు. డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన చ‌లి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Next Story