సింహాచలం ఆలయ మాజీ ఈవోపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం

by Ajay Maddhiboyina |

సింహాచ‌లం ఆల‌య మాజీ ఈవో త్రినాథ్ పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌కు ఆదేశించారు. మాజీ ఈవో మాస్ట‌ర్ ప్లాన్ ఉల్లంఘించి గోడ క‌ట్టేందుకు అనుమతి ఇచ్చార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

సింహాచలం ఆలయ మాజీ ఈవోపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం
X

దిశ‌, వెబ్ డెస్క్: సింహాచ‌లం ఆల‌య మాజీ ఈవో త్రినాథ్ పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌కు ఆదేశించారు. మాజీ ఈవో మాస్ట‌ర్ ప్లాన్ ఉల్లంఘించి గోడ క‌ట్టేందుకు అనుమతి ఇచ్చార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న‌కు మెమో జారీ చేశారు. ఇదిలా ఉంటే గ‌త ఏడాది చంద‌నోత్స‌వం రోజున తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గోడ కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మ‌ర‌ణించ‌గా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. కూట‌మి ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ప్ర‌మాద ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి బాధ్యులైన ఇంజ‌నీర్ల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయించింది. ఇక ఇప్పుడు మాజీ ఈవో త్రినాథ్ మాస్ట‌ర్ ప్లాన్ ఉల్లంఘించార‌ని విచార‌ణ‌లో తేల‌డంతో అత‌డిపై చ‌ర్య‌లకు ఆదేశించింది.

Next Story