- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులకు నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో మళ్లీ నిరాశే ఎదురైంది.

దిశ, వెబ్‌డెస్క్: పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో మళ్లీ నిరాశే ఎదురైంది. పల్నాడు (Palnadu) జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ (TDP) నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వారి పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరు పక్షాల వాదనలు విని తదుపరి విచారణకు మరో రెండు వారాలకు వాయిదా వేసింది. అయితే, ఈ దఫా విచారణలో భాగంగా తమకు బెయిల్ కచ్చితంగా వస్తుందని భావించిన పినెల్లి సోదరుల్లో ఓకింత నైరాశ్యం నెలకొంది.
కాగా, పల్నాడు (Palnadu) జిల్లా గుండ్లపాడు (Gundlapadu) జంట హత్యల ఘటనలో పిన్నెల్లి సోదరులపై మే 25న కేసు నమోదైంది. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. కేసులో జవిశెట్టి శ్రీను, A2గా తోట వెంకట్రావు, A3గా తోట గురవయ్య, A4గా నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు, A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని నిందితులుగా చేర్చారు.






