- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై రిజిస్టర్‌లు బంద్.. ఏపీ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Assembly Speaker Ayyannapatrudu) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అసెంబ్లీలో రిజిస్టర్ అటెండన్స్‌లు ఉండవని చెప్పారు. డిజిటల్ విధానం(Digital Attendance in AP Assembly)లో ఎమ్మెల్యే హాజరును నమోదు చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇది రేపటినుంచి అమలు చేస్తామని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండానే రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. రేపటినుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. సుమారు 20 పనిదినాల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించనున్నారు.






