- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ భార్య డిజిటల్ అరెస్ట్...?
డిజిటల్ అరెస్ట్ ప్రస్తుతం ప్రముఖులను పట్టిపీడిస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: డిజిటల్ అరెస్ట్ ప్రస్తుతం ప్రముఖులను పట్టిపీడిస్తోంది. దొరికినకాడికి దోచుకుంటోంది. ఈజీ మనీ కోసం ఎన్నో నేరాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త రూటు ఎంచుకున్నారు. ప్రముఖులకు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఉన్న పళంగా అరెస్ట్ చేయబోతున్నట్లు నమ్మించి వాళ్ల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో చాలా మంది ప్రముఖులు మోసపోయారు. ఏకంగా హీరో నాగార్జున(Hero Nagarjuna) ఇంట్లో సైతం సైబర్ అరెస్ట్ అయ్యారు. స్వయంగా నాగార్జునే ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా చెప్పుకోలేని వాళ్లు చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు తాజాగా మరో డిజిటల్ అరెస్ట్ కలకలం రేపింది. ఈ సారి ఏపీ రాష్ట్రం మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్(Mydukur MLA Sudhakar Yadav) కుటుంబాన్ని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ. రూ.1.7 కోట్లు కొట్టేశారు. చివరకు అసలు విషయం తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు పుట్టా సుధాకర్ ఫిర్యాదు చేశారు. తన భార్య డిజిటల్ అరెస్ట్ కు గురయ్యారని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కోరారు. ఈ మేరకు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్‌కు పాల్పడిన నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ ఉన్నట్లు తెలుస్తోంది.






