- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం దొరుకుతుందని కొండల్లో తవ్వకాలు.. చివరికి ఊహించని ట్విస్ట్
కొంతమంది ఎలాంటి పనిచేయకుండా కష్టపడకుండానే డబ్బులు రావాలని అనుకుంటారు. ఈ క్రమంలో తప్పుదారులను ఎంచుకుంటారు. వారికి డబ్బులు రాకపోగా చివరికి కటకటాల్లోకి వెళ్లి ఊసలు లెక్కబెట్టే పరిస్థితి వస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: కొంతమంది ఎలాంటి పనిచేయకుండా కష్టపడకుండానే డబ్బులు రావాలని అనుకుంటారు. ఈ క్రమంలో తప్పుదారులను ఎంచుకుంటారు. వారికి డబ్బులు రాకపోగా చివరికి కటకటాల్లోకి వెళ్లి ఊసలు లెక్కబెట్టే పరిస్థితి వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని తలుపుల మండలం పులిగుండ్లపల్లి గ్రామ శివారులో ఓ ముఠా గుప్త నిధుల త్రవ్వకాలు చేపట్టింది. దాదాపు ఎనిమిది మంది కారులో తవ్వకాలకు సంబంధించిన సామాగ్రితో అక్కడకు చేరుకోగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు రెండు కార్లలో వచ్చిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మంది నిందితులు స్పాట్ లో పట్టుబడగా గంగాధర్ అరే వ్యక్తి పరార్ అయ్యాడు. ఎనిమిది మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.






