బలవన్మరణానికి పాల్పడిన డైట్ కళాశాల విద్యార్థి

by Thanuru Gopichand |

ఓ విద్యార్థి బలవన్మరణానికి (Student Suicide) పాల్పడిన హృదయ విదారక ఘటన విజయనగరం (Vizianagaram) జిల్లాలో చోటు చేసుకుంది.

బలవన్మరణానికి పాల్పడిన డైట్ కళాశాల విద్యార్థి
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ విద్యార్థి బలవన్మరణానికి (Student Suicide) పాల్పడిన హృదయ విదారక ఘటన విజయనగరం (Vizianagaram) జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మన్యం జిల్లాలోని సాలూరు మండలం జిల్లేడువలసకు చెందిన కూనేటి మహేశ్ (22) విజయనగరం జిల్లాలోని డైట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత కొంత కాలంగా మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో డైట్ కళాశాల రీడింగ్ రూమ్ లోని ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం రీడింగ్ రూమ్ కు వచ్చి చూసిన విద్యార్థులు సమాచారాన్ని కళాశాల యాజమాన్యానికి చేరవేశారు. యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించడంతో పాటు తోటి విద్యార్థులు, సిబ్బందిని విచారించారు. వారిచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మరణానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానుంది. అయితే తమ కుమారుడి మరణం పట్ల తల్లిదండ్రులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కన్న కొడుకు మరణించడం పట్ల కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Next Story