- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ (Govinda Raja Swamy Temple) గోపురంపైకి ఎక్కి మద్యం తాగిన వ్యక్తి (Drunkard Hulchul) హల్ చల్ చేసిన విషయం విదితమే. అతన్ని మూడు గంటలపాటు శ్రమించి తిరుపతి ఈస్ట్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది కిందకు దింపారు. ప్రస్తుతం తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషనులో దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు.
అయితే తాను మద్యం కోసమే శ్రీగోవిందరాజస్వామి ఆలయ గోపురంపైకి ఎక్కానని సదరు నిందితుడు చెబుతున్నాడు. అంతేకాకుండా గోపురంపై ఉన్న రెండు కలశాలను కూడా ధ్వంసం చేశాడు. అందులోనూ ఏకాంత సేవ అనంతరం గేట్లు మూసిన తరువాత లోపలికి అతను ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది. భక్తులు ఉండని సమయంలో ఆ వ్యక్తికి అక్కడ ఎవరు మద్యం కొనిస్తారనే సందేహాలు కలుగుతున్నాయి.
మద్యం కోసమే అయితే ఏ భవనంపైకి గానీ, సెల్ ఫోన్ టవర్ పైకి గాని ఎక్కి హడావుడి చేసేందుకు అవకాశం ఉంది. కానీ ప్రత్యేకంగా దేవాలయం వద్దకే.. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవాలయం వద్దకే.. అందులోనూ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురం వద్దకే ఎందుకొచ్చాడనే ప్రశ్నలు భక్తుల మెదళ్లను తొలుస్తున్నాయి.
గతంలో అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రథాన్ని తగలబెడితే అతని మానసిక స్థితి బాగాలేదన్నారు.. అంతకు ముందు రామతీర్థం ఘటనలో కూడా మెంటల్ కేస్ అన్నట్లుగా కవర్ చేశారు.. మొన్నటికి మొన్న ద్రాక్షారామంలో కపిలేశ్వర స్వామి లింగాన్ని భిన్నం చేస్తే వ్యక్తిగత కక్షలనే కలరింగ్ ఇచ్చారు.. ఇప్పుడు ఏకంగా గోవిందరాజస్వామి వారి గోపురంపైకి ఎక్కి కలశాలను ధ్వంసం చేసే యత్నం చేస్తే.. 90ఎంఎల్ మద్యం కోసం అతను అలా చేశాడనే అంశానికి ప్రచారం కల్పిస్తున్నారు.
పిచ్చివారికైనా.. మద్యం సేవించేవారికైనా.. వ్యక్తిగత కక్షలైనా కేవలం హిందూ ధార్మిక కేంద్రాలే ఎందుకు లక్ష్యమవుతున్నాయో? అనే ప్రశ్నకు మాత్రం నేటికీ సమాధానం లభించడం లేదని ప్రజలు అంటున్నారు. నిజంగానే మద్యం కోసమే సదరు వ్యక్తి మహాపచారం చేసి ఉంటే.. కేవలం హిందూ ధార్మిక స్థలాలను లక్ష్యం చేసుకునేలా ప్రేరేపించే మద్యం విక్రయాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలని హిందూ ధార్మిక సంఘాల వారు భావిస్తున్నారు.






